సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో మాంచి జోష్ లో ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు రవితేజకు ఓ హిట్టిచ్చేందుకు కథ సిద్ధం చేసుకున్నాడు. రవి తేజకు ఈ మధ్య కాలంలో హిట్లు తగ్గాయి. కిక్ 2 అయితే ఘోరంగా డిజాస్టర్ అయ్యింది దీంతో హరీష్ శంకర్ ఆయనకు హిట్ ఇచ్చే కథ రెడీ చేస్తున్నాడు. వీరిద్దరికీ మంచి స్నేహం ఉంది. ‘షాక్’ సినిమాతో తనకి ఫ్లాప్ ఇచ్చినా, హరీష్ తో స్నేహం కారణంగా ఆయనపై నమ్మకంతో రవితేజ ‘మిరపకాయ’కి ఒకే చెప్పాడట. అంతగా తనని నమ్మిన రవితేజకు ఎలాగైనా హిట్ ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాడట హరీష్. ఆయన కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు కూడా తనే సమకూర్చుకోబోతున్నాడట. ఇక నిర్మాతగా కూడా దిగే ఆలోచన ఉందట. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పటికి మొదలు పెడతారో వేచి చూద్దాం.