టాలీవుడ్ లో అఖిల్ కు ఓ ప్రత్యేకత ఉంది. కేవలం ఒక సంవత్సరం వయసులో రెండున్నర గంటల లెంగ్త్ సినిమా చేసిన చరిత్ర అఖిల్ ది. ఇంత చిన్న వయసు వారిని బహుశా ఏ సినిమాలోనూ కొద్ది నిమిషాల పాత్ర చేయించాలనే ఆలోచన కూడా బహుశా ఏ డైరెక్టర్ కూ రాక పోవచ్చు.
ఇక ఆ తరువాత అఖిల్ ని బాల నటుడిగా కూడా ఒక్క సినిమాలోనూ చూపించగలేదు నాగ్. ఇక మనంలో జస్ట్ తాతతో ఎంట్రీ ఇప్పించి... హీరో గా ఇప్పుడు పకడ్బంధీ ప్లానింగ్ తో దించేస్తున్నాడు నాగార్జున. అఖిల్ సినిమా కోసం ప్రతి విషయంలోనూ ఆచీ తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు నాగార్జున ఈ నెల 22న అఖిల్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన టీంతో పాటు.. నాగార్జున కూడా తన ప్రతిభను మొత్తం ఉపయోగిస్తున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ చేసేందుకు ఎన్నో వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం 2గంటల 40 నిమిషాల డ్యురేషన్ ఉండాలని డిసైడ్ అయ్యాడు డైరెక్టర్ వివి వినాయక్. ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాకపోయినా.. మూవీని ఆద్యంతం చూసిన నాగార్జున.. ఓ అరగంట కట్ చేయాలని చెప్పాడట. లెంగ్త్ విషయంలో నిర్మాత నితిన్ తో పాటు దర్శకుడు కూడా కాన్ఫిడెంట్ గానే ఉన్నా, ఎక్కడా లాగ్ అనిపించకుండా ఉండేందుకు నాగ్ ట్రై చేస్తున్నాడు. మూవీ చూస్తున్నంతసేపు ఆద్యంతం థ్రిల్ ఉండాలని ఎక్కడా స్క్రిప్ట్ డ్రాగ్ అయినట్లు అనిపించకుండా ఉండాలన్నది నాగ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం రాకపోయినా, నాగార్జున సూచనను కూడా పక్కకు పెట్టే ప్రసక్తి ఉండకపోవచ్చు. లెంగ్త్ తగ్గించడం వల్ల మల్టీ ప్లెక్స్ వంటి స్క్రీన్ ల మీద ఎక్కువ షోలు వేయొచ్చనేది నాగార్జున ఆలోచనలా కనిపిస్తుంది. దీంతో పాటు జనాల్లో సాగదీత ఫీలింగ్ ఉండ కూడదని ఆయన ఉద్దేశం. ఫైనల్ గా నాగార్జున అభిప్రాయాన్ని ఓకే చేసేలా ఉన్నారు ఈ చిత్రం బృందం.