కరీనా సినిమా పట్ల, తను చేసే పాత్రపట్ల చాలా డెడికేషన్ చూపిస్తుందనీ, కమిట్ మెంట్తో ఉంటుందన్న వార్తలు బాలీవుడ్ లో బాగా ప్రచారంలో ఉన్నాయి. సినిమాలో తన క్యారెక్టర్ ను బట్టి ఎంత శ్రమకైనా వెనుకాడకుండా తెరమీద చాలా బాగా ప్రెజెంట్ చేయడానికి కృషి చేస్తుందట. ఇటీవల ఓ సినిమాలో తన పాత్రకు తగినట్టుగా బాడీ లాంగ్వేజ్ ఉండాలని పంజాబీ నేర్చేసుకుంది ఈ భామ. ప్రస్తుతం మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ‘ఉడ్తా పంజాబీ’ అనే ఈ సినిమాలో తను పంజాబీ అమ్మాయిలా నటిస్తోంది. అందుకోసం తన శరీర భాషను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా, పంజాబీ భాష అదే యాక్సెంట్ తో నేర్చేసుకుంది. తను ఈ భాషను కేవలం పది రోజుల్లో నేర్చుకుంటానని స్నేహితులతో ఛాలెంజ్ చేసి, అన్నట్టుగా నేర్చుకుని మరీ చూపించింది. ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ రజత సింగ్ వద్ద పంజాబీ క్లాసులకు వెళ్ళి పట్టుదలగా నేర్చుకుని, ఇప్పుడు పంజాబీ భాషలో తెగ మాట్లాడేస్తుందట కరీనా.