నటసింహ బాలకృష్ణ 100వ సినిమాకి సంబంధించి రోజుకో గాసిప్స్ బయటికి వస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం చారిత్రక నేపథ్యంగా, ఇక ఇందులో బాలయ్య 'గౌతమిపుత్ర శాతకర్ణి' గా కనిపించనున్నట్లు అల్రెడీ సంకేతాలు అందాయి కూడా. 'ఉగాది' రోజున 'అమరావతి'లో ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో ఆయన సరసన నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన రాజమాత పాత్రలో అలనాటి బాలీవుడ్ నటిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలినిని ఈ పాత్ర కోసం నిర్మాతలు సంప్రదిస్తున్నారంట. బాహుబలిలో శివగామి పాత్ర తరహాలో చాలా పవర్ ఫుల్ గా ఈ పాత్ర ఉండబోతుందని చెబుతున్న క్రిష్ ఆ పాత్రకి హేమా మాలిని అయితేనే సరిగ్గా సరిపోతుందని భావిస్తున్నాడంట. ప్రస్తుతం విదేశాల్లో వున్న హేమమాలిని, ఏప్రిల్ 10న తిరిగి రానున్నారట. ఆ వెంటనే ఈ సినిమా టీమ్ ఆమెను సంప్రదించనున్నట్టు చెబుతున్నారు. హేమమాలిని ఓకే అంటే చాలాకాలం తరువాత తెలుగు ప్రేక్షకులకు లభించిన అదృష్టమే అవుతుంది.