క్రిష్ కంచె ఫస్ట్ లుక్ నుంచీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విజయదశమి రోజు విడుదలవుతున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్న టాక్ ఇప్పటికే వచ్చేసింది. వరుణ్ కు ఈ రోల్ బాగా సూటయ్యింది. ఈ రోజు విడుదలైన టీజర్ లో డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తున్నాయి. వరుణ్ సైనికుడిగా, లవర్ గా చేస్తున్న ఈ పాత్ర అతనికి బాగా సూటైనట్టు అనిపిస్తోంది. రిలీజ్ సమయం దగ్గర పడటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని ముమ్మరం చేసారు. ఈ సినిమా బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది. ఓవర్ సీస్ లో సైతం ఈ చిత్రం మంచి రేటుకు అమ్ముడుపోయింది. ఓవర్ సీస్ లో కొత్తగా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోకి ప్రవేశించిన ‘అబ్జెల్యూట్ తెలుగు సినిమా’వారు ఈ చిత్రం రైట్స్ ని కోటి పాతిక లక్షలకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ కంపెనీని కొంతమంది ఎగ్జిబిటర్స్ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. అయితే సినిమా గురించి దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం జార్జియా గవర్నమెంట్ అనుమతి తీసుకుని ఆ బ్యాక్ డ్రాపుకు తగిన విధంగా గన్స్, ట్యాంకర్స్, టీకప్స్ ఇలా అన్నీ ఉపయోగించాం. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ తనకు బాగా సహకరించారని చెప్పాడు. మనకు చాలా మంది దర్శకులు ఉన్నా ఎందుకో రెండో ప్రపంచ యుద్ధం గురించి కథను తీయలేదు. నేను ఎవరికీ భిన్నంగా ఉండాలని ఈ కథను చెప్పలేదు. చెప్పని కథలను చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్' అన్నారు. చిత్రంలో కనిపించే 1940ల నాటి దృశ్యాలు, యుద్ధ సన్నివేశాలు మేకింగ్ వీడియోలో చూసి చాలా మంది థ్రిల్ అయ్యారు. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, సాయిబాబా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు