ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఎప్పుడు ఎవరి కెరీర్ ను ఎలా మార్చుతుందో తెలియడం లేదు. ఏమైనా ఒకప్పటిలా ఆశాజనకంగా లేదనే చెప్పాలి. ఓ పాషన్ తో ఎంటరైన చాలా మంది అదృష్టం కలిసి రాక పక్కకు తప్పుకుంటున్నారు. క్లిక్కయిన వారూ... ఓ మోస్తరుగా నటించిన వారూ... కెరీర్ ను ఇంకో విధంగా మలుచుకోక తప్పడం లేదు. సినిమాలే పట్టుకుని వేలాడితే ఫైనాన్షియల్ పొజిషన్ బాడ్ అయిపోతుంది మరి. అందుకే హీరోయిన్లు కొందరు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు.
తక్కువ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ప్రణీత ఓ వైపు వెండితెరపై ప్రయత్నిస్తూనే ... ఇంకోవైపు బిజినెస్‌లోకి అడుగుపెట్టేసింది. ఇటీవల బెంగుళూరులోని టాప్ హోటల్లో మేజర్ పార్ట్‌ను ఈమె కొనుగోలు చేసిందట. ఈ వ్యాపారాన్ని ఆమె పేరెంట్స్ దగ్గరుండి చూస్తున్నారని సమాచారం. ప్రణీత తల్లిదండ్రులు వృత్తిరీత్యా డాక్టర్స్. పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఇక తాము తప్పుకోవడం ఉత్తమమనుకొని ఏదో ఒక బిజినెస్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికే త్రిష, రాధ, తమన్న ఈ తరహా బిజినెస్‌లోకి వెళ్లారు.