ఈ మధ్య విడుదలవుతున్న సినిమాలకు ఎక్కడినుంచి ఏ అవాంతరాలు వచ్చి పడతాయో తెలియకుండా ఉంది తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ' చిత్రానికి వ్యతిరేకంగా హిజ్రాలు, ట్రాన్స్ జెండర్స్ ఆందోళనకు సిద్ధమయ్యారు. ‘ఐ' సినిమాలోని కొన్ని సీన్లు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ పాత్ర ఓస్మా ను చిత్రీకరించిన తీరు తమ మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉందని హిజ్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఐ' సినిమాలో ఓస్మా పాత్రను ఓజాస్ రజనీ పోషించారు. ఓజాస్ రజనీ ఈ సినిమాలో మాత్రమే కాదు, నిజ జీవితంలో సేమ్ టు సేమ్. ఓజాస్ రజనీ ఐశ్వర్యరాయ్ తో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్లకు హెయిర్ డ్రెస్సర్ గా మేకప్ మేన్ గా పని చేసారు. అయితే ఓస్మా పాత్రను విలన్ పాత్రగా చిత్రీకరించడంపై ట్రాన్స్ జెండర్స్ ఆగ్రహంగా ఉన్నారు. దర్శకుడు శంకర్ ఇంటి ముందు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు