నామీద అందరికీ జలసీ: బాలీవుడ్ క్వీన్

July 11, 2015 | 04:36 PM | 3 Views
ప్రింట్ కామెంట్
kangana_btown_talk_niharonline

ఎంత ముక్కుసూటి తనమో అంత నిజాయితీగా వ్యవహరిస్తుంది కంగన. అనవసర వ్యాఖ్యానం ఎంత మాత్రమూ ఉండదు. కాకపోతే అర్థం చేసుకుకోవడం లోనే తేడా. ‘క్వీన్’ ‘తను వెడ్స్ మను’ రిటర్న్స్వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రౌనత్. గ్లామర్‌తోపాటు నటనతోనూ మెప్పించి కలెక్షన్ల సునామీ సృష్టించింది. అలాగే వివాదాస్పద కామెంట్లు చేయడంలో కూడా ఈ బాలీవుడ్ క్వీన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో మిమ్మల్ని చూసి ఎవరైనా అసూయ పడుతున్నారా? అని ప్రశ్నిస్తే ’నన్ను చూసి బాలీవుడ్ హీరోయిన్లందరూ అసూయ పడుతున్నారు. ఒక్కొక్కరి పేరు చెప్పడం కష్టం. వారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయినా ఇటీవల నేను సాధించిన విజయాలు అలాంటివి’ అంటూ సమాధానమిచ్చింది. ఇందులో వాస్తవాలు ఉండకపోవు. పోటీతత్వంలో జలసీలు మామూలే కదా... అలాగే తాను డబ్బు కోసం మాత్రమే ఇండస్ట్రీకి వచ్చినట్టు కూడా ముక్కుసూటిగా మాట్లాడేస్తోంది కంగన.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ