హీరో కూతురి సీక్రెట్ పెళ్ళి... లైట్...

October 07, 2015 | 03:17 PM | 2 Views
ప్రింట్ కామెంట్
isabella-tom-cruise-niharonline

ఏ స్టార్ హీరో కూతురు ఎక్కడ కనిపించినా మీడియా వాళ్ళు వెంట పడి ఏదో ఒకటి అడిగేస్తుంటారు... ఇక ఆ అమ్మాయి తన ఫ్రెండ్ తో ఏ సినిమా థియేటర్లోనో... పబ్ లోనో కనిపించిందనుకోండీ... మరునాడు అన్ని వార్త ప్రతికల్లో ఓ సింగిల్ కాలమ్ న్యూస్... అలా కాకుండా ఆ అమ్మాయి ఎవరినైనా పెళ్ళి చేసుకుంటే... ఛానళ్ళు గంటలు గంటలు అదే వార్త రిపీట్ చేస్తుంటారు ప్రింట్ వాళ్ళయితే ఓ పెద్ద పేజీ నిండా వార్తలు ప్రచురిస్తాయి... ఇదంతా మన దేశంలో... కానీ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ కూతురు ఇసబెల్లా క్రూజ్. తన బాయ్ ఫ్రెండ్ ను సిక్రెట్ గా పెళ్లాడిందట. ఇది ఏదో లోపలి పేజీల్లో చిన్న సింగిల్ కాలమ్ ఐటమ్ వస్తుంది. ఈ వివాహానికి టామ్ క్రూజ్ సహా అతని మాజీ భార్య నికోల్ కిడ్ మన్ లు హాజరుకాలేదని లండన్ కు చెందిన 'విమెన్స్ డే' మ్యాగజైన్ ఈ విషయాన్ని తాజాగా  ప్రచురించింది. లండన్ లో హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తోన్న టామ్ కూతురు ఇసబెల్లా (22 ఏళ్లు).. ఏడాదికాలంగా మాక్స్ పార్కర్ అనే ఐటీ కన్సల్టెంట్ తో డేటింగ్ చేస్తోంది. కాగా, ఈ జంట.. నెలరోజుల కిందట వివాహం చేసుకుంది. అది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ వివాహానికి టామ్ క్రూజ్ కానీ ఆయన కుటుంబ సభ్యులు ఎవ్వరు హాజరు కాలేదట. క్రూజ్, నికోల్ కిడ్ మన్ లు భార్యాభర్తలుగా కలిసున్న కాలంలో ఇసబెల్లాను దత్తత తీసుకున్నారట. క్రూజ్ కూతురు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు..

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ