‘పడ్డానండీ ప్రేమలో మరి’ సినిమాలో నటించి నిజంగానే ప్రేమలో పడిపోయారండీ ఆ హీరో హీరోయిన్లు... వరుణ్ సందేష్ – వితికా సెరు. ఈ విషయం ఇంతకుముందే వార్తలో వచ్చినప్పటికీ ఇప్పుడు వితిక సెరు కన్ ఫం చేసింది మరొక్కసారి.
అయితే తాజా వార్త ఏమిటంటే ఈ ప్రేమ పక్షులు నవంబర్ లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారట. పెళ్ళి మాత్రం వచ్చే సంవత్సరం చేసుకుంటామంటున్నారు. ఈ విషయాల్ని వితికా సేరు మీడియా వారితో మాట్లాడుతూ తెలియజేసింది.
తామిద్దరూ ‘పడ్డానండీ ప్రేమలో మరి’ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డట్టు కూడా తెలిపింది. వీరిద్దరూ కలిసి ఇంట్లో వారిని పెళ్ళికి ఒప్పించినట్టు తెలిపింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ రెండు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారట. ఆల్ ద బెస్ట్ టూ వరుణ్, వితిక.