ఎంతో ఆలోచించి ఆలోచించి స్టెప్ వేసే నేచర్ సురేష్ బాబుది. తన ఇంటర్వ్యూల్లోనూ చెప్పుకున్నాడు తను చాలా భయస్తుడినని... తన తండ్రికి ఉన్న డేర్ ఈ నిర్మాతకు లేదనే చెప్పాలి. పక్కా కాన్ఫిడెన్స్ ఉంటేనే స్టెప్ వేయగలడు. అంటే ఈ లెక్కన ‘హోరీ హోరీ’ తనకు బాగా నచ్చబట్టే వాటా తీసుకోడానికి ముందుకొచ్చాడు. డైరెక్టర్ తేజ చాన్నాళ్ళుగా హిట్ కొట్టలేకపోయాడు. ‘జయం’ తర్వాత ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఇప్పుడు తన కొత్త సినిమా ‘హోరాహోరీ’కి కొంచెం క్రేజ్ తేగలిగాడు. అయినా విడుదల అయోమయంగా ఉన్న తరుణంలో అగ్ర నిర్మాత సురేష్ బాబు వాటా తీసుకోవడంతో రిలీజ్ డేట్ ఫిక్సయిపోయింది. సెప్టెంబరు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజు ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ విడుదలవుతున్నప్పటికీ.. పోటీగా ‘హోరాహోరీ’ని రిలీజ్ చేయబోతున్నారు.దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్ లో క్వాలిటీగా తీశానని చెప్పుకున్నాడు తేజ. సురేష్ బాబు బ్రాండ్ ఉంటే విడుదలకు ఆటంకాలు తొలగిపోయినట్లే. థియేటర్ల సమస్య ఉండదు. అందుకే సురేష్ బాబు వాటా అడిగేసరికి వెంటనే ఓకే చెప్పేశాడట దామోదర్ . తప్పకుండా ఇది హిట్ పిక్చర్ అవుతుందని తేజ సినిమా ఆడియో వేడుకలో చెప్పుకున్నాడు. కొత్త హీరో హీరోయిన్లు దిలీప్ దక్ష.. ప్రోమోస్ లో బాగానే కనిపిస్తున్నారు. కాన్సెప్ట్ టేకింగ్ పరంగా కొత్తపుంతలు తొక్కినట్లు ‘హోరాహోరీ’ యూనిట్ చెబుతోంది. ఈ సినిమా పోస్టర్లు జయం సినిమాను తలపింప చేస్తున్నాయి. ఈ లవ్ స్టోరీ బాగుంటుందని ఆడియన్స్ కూడా ఫిక్సయ్యారు. మరి హోరీ హోరీ భవితవ్యం సెప్టెంబర్ 11తో తేలిపోతుంది.