సుజానె పెళ్ళి చేసుకోబోతోందట...

September 15, 2015 | 04:05 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Suzanne-Khan-hruthik-ex-wife-niharonline

ఒకప్పుడు హాలీవుడ్ సిల్వెస్టెర్ స్టాలోన్ తో పోల్చిన హృతిక్ రోషన్ ఒకేసారిగా ఆయన స్టార్ డం పడిపోవడానికి కారణం ఆయనకు హిట్ సినిమాలు లేకపోవడమా? లేక ఫామిలీ ప్రాబ్లమ్స్ వల్లనా అనేది స్పష్టంగా చెప్పలేకపోయినా అతని స్థానం మాత్రం టాప్ టెన్ లాస్ట్ లోకి చేరిపోయింది. ఒకప్పుడు నెంబర్ వన్ గా బాలీవుడ్ లో వెలిగిపోయిన ఈ హీరో భార్యనుండి విడాకులు తీసుకోవడం తో ప్రపంచ వ్యాప్తంగా ఈ వార్త మారుమోగిపోయింది. అందులో ఆయన కొద్ది రోజులు అనారోగ్యంతో కూడా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతను ఎవరితోనో ప్రేమలో పడ్డాడనీ, డేటింగ్ కూడా చేస్తున్నాడనీ, పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని ఊహాగానాలు చెలరేగాయి. కానీ ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నది హృతిక్ రోషన్ కాదు, అతని మాజీ భార్య సుజానె అని అంటున్నారు. హృతిక్ రోషన్-సుజానె జంట విడిపోవడం పెద్ద షాక్ అయ్యింది అందరికీ. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట చాలా ఏళ్ల పాటు అన్యోన్యంగా ఉన్నారు. అసలు వీరు ఎందుకు విడిపోయారనే దానిపై సరైన కారణం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. మీడియా ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోని హృతిక్ రోషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ- ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నాను. ఎవరితోనూ మింగిల్ కావడానికి సిద్ధంగా లేను అని స్పష్టం చేసాడు. కంగనా రనౌత్ తో హృతిక్ రోషన్ ఎఫైర్ నడుపుతున్నాడనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ విధంగా రిప్లై ఇచ్చారు. కాగా. హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానె త్వరలో మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది అర్జున్ రాంపాల్‌ను మాత్రం కాదట. ఎవరిని పెళ్లాడబోతోందనే విషయం ఇంకా సీక్రెట్ గానే ఉంది.  ఆమె పెళ్ళి వార్త అఫీషియల్ గా తెలిపే వరకూ వెయిట్ చేయాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ