చరిత్ర ఆధారంగా తీసిన సినిమా రుద్రమ దేవిలో టైటిల్ పాత్రను అనుష్క పోషించినప్పటికీ ఇందులో మరో ముఖ్యమైన పాత్రలో రానా నటించారు. చాళుక్య వీరభధ్ర గా దగ్గుబాటి రానా నటించాడు. అక్టోబర్ 9న విడుదల అవుతున్న ఈ చిత్రం రానా కొత్త పోస్టర్ ని విడుదల చేసారు. హిస్టారికల్ మూవీ హిందీ రైట్స్ ని రిలయన్స్ కు చెందిన అబిషేక్ పిక్చర్స్ వారు 22 కోట్లకు సొంతం చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ కింగ్ గా పేరొందిన దిల్ రాజు నైజాం మాత్రమే కాకుండా మిగతా ఏరియాలలో కొన్ని తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇంతకుముందు పటాస్, బాహుబలి చిత్రాల విజయాలు అంచనా వేసి తీసుకుని లాభాలు గడించిన దిల్ రాజు ఈ చిత్రం పంపిణీ హక్కులు పోటీపడి తీసుకోవటంతో బిజినెస్ ఒక్కసారిగా వేడిక్కింది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న దిల్ రాజు రీసెంట్ గా చిత్రం ఫైనల్ కట్ చూసి ఇంప్రెస్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన నైజాం రైట్స్ మాత్రమే కాక, ఆంద్రాలో కొన్ని ప్రాంతాలు వైజాగ్ తో సహా తీసుకున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్, అనుష్క లు ప్లస్ అవుతారని భావిస్తున్నారు. మరో ప్రక్క వారాహీ చలన చిత్రం బ్యానర్ నిర్మాత కొర్రిపాటి సాయి ..'రుద్రమదేవి' చిత్రం కృష్ణా ఏరియా రైట్స్ తీసుకున్నారని సమాచారం. ఆ ఏరియాకు ఆయన రెండు కోట్ల ఎనభై లక్షలు చెల్లించారని తెలుస్తోంది.