బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ ఓ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. తాను డబ్బు కోసం దిగజారలేననీ, అసభ్యకరమైన పాటలు రాయడం నా వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేశాడు. జైపూర్లో జరిగిన ఓ సాహిత్య ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించిన సందర్భంలో ఈ మాట అన్నారయన. డబ్బు కోసం కొందరు డిమాండ్ చేసి మరీ రాయించుకుంటున్నారనీ, దీంతో సాహిత్యపరమైన స్వేచ్ఛ, స్రుజనాత్మకతలు దెబ్బతుంటున్నాయని అనానరు. రచయితలు రెండు రకాలుంటారనీ, కొందరు మార్కెట్ ను , డిమండ్ ను అనుసరించి పాటలు రాస్తే, మరికొందరు తమ అభిరుచి మేరకే పాటలు రాస్తారనీ అన్నారు. మెప్పు పొందేందుకు పాటలు రాసేవారు కూడా డబ్బు కోసం రాసేవారని అన్నారు. తాను మాత్రం తన మనసుకు నచ్చినట్టే రాస్తానని డబ్బుకు లొంగనని వ్యాఖ్యానించారు.