రాజకీయ రంగంలో తలమునకలైపోయి సినిమాను పూర్తిగా మర్చిపోయింది విజయశాంతి. చాలా కాలం తరువాత తిరిగి తెరమీద మళ్ళీ కనిపించబోతోందట ఈ రాములమ్మ. ఆగిపోయిందనుకున్న గోపీ చంద్ సినిమా తిరిగి తెరమీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు బి.గోపాల్. అయితే ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్రలో నటించేందుకు విజయశాంతి అంగీకారం తెలిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విజయశాంతి-బి.గోపాల్-బాలక్రిష్ణ కాంబినేషన్ లో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. తాజాగా గోపీచంద్ నటించే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ మహిళ క్యారెక్టర్ లో కనిపించబోతోందట. ఈ క్యారెక్టర్ కు విజయశాంతి అయితేనే భాగుంటుందని ఆమెను సంప్రదించినట్టు సమాచారం. చాలా కాలం తరువాత తిరిగి తెరమీద కనిపించే విజయశాంతికి ఈ రోల్ ద్వారా తిరిగి సినిమా ఫీల్డ్ స్వాగతించవచ్చు.