‘ఐ’ సినిమాకు మళ్ళీ ఆటంకం?

December 17, 2014 | 01:39 PM | 27 Views
ప్రింట్ కామెంట్

‘ఐ’ సినిమాకు మళ్ళీ ఆటంకం? "ఐ" సినిమాకు ప్రారంభం నుంచీ ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. కాగా ఈ చిత్రానికి మళ్లీ ఇంకో సమస్య ఎదురవుతోంది. ఓవర్ సీస్ రైట్స్ విషయంలో వివాదం నెలకొందని సమాచారం. ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ తమకే ఇచ్చారని రాకేష్ రోషన్ అల్లుడు, హైపర్ బీస్ గ్రూప్ హెడ్ వాదిస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ వివరాల ప్రకారం, ఆస్కార్ ఫిల్మ్స్ సంస్ధ నుంచి ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని B4U, హైపర్ బీస్ గ్రూప్ కొనుగోలు చేసి ఐదు కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది. మిగిలిన పేమెంట్ 5 కోట్లు డిసెంబర్ 12 కి చెందేలా వారు దాన్ని అమెరికా నుంచి వైర్ చేసారు. అయితే ముంబై లోని బ్యాంక్ లో అది ఆగిపోవడంతో అది తమకు అందలేదు కాబట్టి ఎగ్రిమెంట్ కాన్సిల్ చేసింది ఆస్కార్ ఫిల్మ్స్ సంస్ధ. తామే డైరక్ట్ గా రిలీజ్ చేస్తున్నట్లు కొన్ని తమిళ వెబ్ సైట్స్ లో ప్రకటనలు సైతం ఇచ్చేసింది. ఈ లోగా ఆ వైర్ ఎమౌంట్ వచ్చింది. ఇదంతా గమనించిన B4U వారు లీగల్ గా కోర్టుకు వెళ్తామని అంటున్నారు. మరో ప్రక్క అసలు ఈ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయో తెలియక ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్లు డైలమాలో ఉన్నారు. చిత్రం ప్రారంభం నుంచే భారతీయ సినీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోన్న సంగతి తెలసిందే. కొన్నాళ్ళ క్రితం చెన్నైలో విడుదలైన ఈ సినిమా ఆడియో మంచి విజయం సాధించి సినిమాపై చాలా అంచనాలతో ఉన్నారు. దీనిన విదేశీ భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుందనే అంచనాలపై దర్శకుడు, హీరో విక్రమ్ కూడా భావిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ