బాలయ్య తన అభిమానులకు కొత్త సంవత్సరం కానుక ఇవ్వాలనుకుంటున్నారు. అదేమిటంటే ఆయన నటించే చిత్రానికి టీజర్‌ను డిసెంబరు 31, అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి 'వారియర్', 'లయన్' అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని అదే రోజు ప్రకటించాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సత్యదేవా దర్శకత్వం వహిస్తుండగా, త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్లు. రుద్రపాటి రమణారావు నిర్మాత కాగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే ‘లయన్ ' అనే పేరును ఏపీ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. అయితే ఈ టైటిల్‌తో తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఎప్పుడో రిజిస్టర్ చేయించాను అంటూ ఓ నిర్మాత వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్ వివాదం ఫిలింనగర్ హాట్ టాపిక్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకుని డిసెంబర్ 31న టీజర్ విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక బాలకృష్ణ 99వ చిత్రానికి లౌక్యం దర్శకుడు శ్రీవాసు అని తెలుస్తోంది. దీంతో పెద్ద దర్శకుల జాబితాలో చేరిపోయే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.