అనుకున్న తేదీకి యంగ్ టైగర్ టెంపర్ చూద్దామనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యింది. సంక్రాంతికి ఐదు రోజుల ముందే పండగ చేసుకుందామనుకున్న నందమూరి ఫ్యాన్స్ చిత్రం వాయిదా పడిందని తెలియగానే డీలా పడిపోయారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆటంకం ఎదురవుతున్నా… తట్టుకుంటూ రేయింబవళ్లు కష్టపడుతూ త్వరగా షూటింగ్ పూర్తిచేయాలని చూసినా ఫలితం లేకపోయింది. పెద్ద అన్నయ్య జానకిరామ్ మృతితో విషాదంలో మునిగిపోయిన ఎన్టీఆర్.. ఇప్పడిప్పుడే షూటింగ్‌లో పాల్గొనే పరిస్థితి లేకపోవడంతో టెంపర్ షూటింగ్ సకాలంలో పూర్తి చేసి.. ముందుగా అనుకున్నట్లు జనవరి 9న విడుదల చేసే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఆ రోజు సినిమా విడుదల కాదని టెంపర్ టీమ్ చెప్పేసింది, సినిమా వాయిదా పడిపోయింది. దీంతో సంక్రాంతికి గోపాల గోపాల సోలోగా విడుదల కాబోతుందని అనుకున్నారంతా. అయితే టెంపర్ రిలీజ్ చేయాలనుకున్న రోజే శంకర్, విక్రమ్‌ల టెక్నికల్ వండర్ ఐ ని విడుదల చేయాలని నిర్ణయించారట. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. శంకర్ సినిమాలకు తెలుగులోనూ పెద్ద మార్కెట్ ఉంది. ఒకనోకదశలో టెంపర్, గోపాల గోపాల లాంటి బడా సినిమాల మధ్య ఐ ని ఎలా రిలీజ్ చేయాలా అని శంకర్ ఆలోచనలో పడ్డాడట. ఐతే టెంపర్ రేసు నుంచి తప్పుకోవడం అటు తమిళంలో, తెలుగులో ఐ ని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. మొత్తానికి టెంపర్ ను చూద్దామనుకున్న తెలుగు జనాలు దాని స్థానంలో ఓ వండర్ ని చూడబోతున్నారన్న మాట.