ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ పేరుతో (ఐఫా) 2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ అవార్డుల వేడుక అంతకు ముందు వరకూ బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైంది. కానీ ఈ ఉత్సవాన్ని సౌత్ లో కూడా జరిపేందుకు నిశ్చయించారు. సౌతిండియన్ సినిమాలైన తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ ఇలా నాలుగు భాషలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో ఈ ఐఫా ఉత్సవం జరుపనున్నారు.
డిసెంబర్ 6నుంచి మూడు రోజుల పాటు హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఐఫా ఉత్సవం జరుపనున్నట్టు నిర్ణయించారు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరిపే దిశగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉదయం హైద్రాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఐఫా ఉత్సవంనకు సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు సినీ ప్రముఖులు నాగార్జున, అల్లు అరవింద్, కమల్ హాసన్, వెంకటేష్, అల్లు శిరీష్, తమన్నా తదితరులు హాజరై ఐఫా ఉత్సవం హైద్రాబాద్‌లో జరగనుండడం సంతోషకరమని తెలిపారు. ఈ ఉత్సవాన్ని అన్ని విధాలా ది బెస్ట్ అనిపించేలా చేసేందుకు సంస్థ పరంగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ఐఫా ఈ సందర్భంగా ప్రకటించింది.