జేమ్స్ బాండ్ అదోక బ్రాండ్. ఆ సిరీస్ చిత్రాలకు ఉన్న క్రేజ్ ఏపాటిదో తాజాగా వచ్చిన స్పెక్ట్రె ను చూస్తే తెలిసిపోతుంది. ఇక తెలుగులో జేమ్స్ బాండ్ అంటే టపీమని చెప్పే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన తర్వాత వచ్చిన హీరోలో ఏ ఒక్కరు కూడా ఆ డేరింగ్ ను చేయలేకపోయారు. తాజాగా ఆయన వారసుడు మహేష్ బాబు త్వరలో జేమ్స్ బాండ్ పాత్రలో కనిపించబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది కూడా రాజమౌళి దర్శకత్వంలో అని. అయితే ఆ ఊహాగానాలు పక్కనబెడితే జేమ్స్ బాండ్ పాత్రకి మహేష్ పర్ ఫెక్ట్ గా సూటవుతాడన్నది మాత్రం నిజం. హాలీవుడ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫీచర్స్ ఉన్న మహేష్ తో గనక బాండ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది. అందులో పాత్రలు ఎవరు చెయ్యోచ్చు.
ఇక పోతే ఆ ఫ్లాన్ ని వర్కవుట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు ఓ కల్పిత రూపం. హీరోయిన్, మిగతా పాత్రలు పక్కన బెడితే ఒకవేళ మహేష్ గనక బాండ్ క్యారెక్టర్ చేస్తే విలన్ ఎవరన్నదీ ఇప్పుడు ప్రశ్న. ఒకవేళ మహేష్ గనక బాండ్ సినిమా తీస్తే అది ఖచ్ఛితంగా స్టైలిష్ గా ఉండి తీరాలి. మరి అలాంటప్పుడు విలన్ కూడా అందుకు తగ్గట్లే ఉండాలి కదా. ఇప్పుడున్న వారిలో దానికి కరెక్ట్ గా సూటయ్యే లక్షణాలు ఉన్న నటుడు ఎవరంటే గుర్తోచ్చేది రానాయే. బాహుబలిలో భళ్లాలదేవుడిగా అదరగొట్టిన ఈ హ్యాండ్సమ్ హంక్ అవసరమయితే విలన్ పాత్రలకు ప్రాధాన్యం ఇస్తానని చాలా సార్లు చెప్పుకోచ్చాడు. ఇక అనుకోకుండా వీరిద్దరు భలే మంచి రోజు ఆడియో పంక్షన్లో పక్క పక్కన కూర్చున్నారు. అలా వీరి ఫోటో నుంచి పుట్టిందే ఈ ఆలోచన. కన్ఫర్మ్ మాత్రం చేసుకోకండి.