ఇద్దరు స్టార్ డైరక్టర్లే. కోట్లకు కోట్టు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. దాదాపు అగ్రహీరోలందరితో సినిమాలు తీశారు. కామెడీ, యాక్షన్ ఇద్దరి సినిమాలో ప్రధాన ఆయుధాలు. అలాగే ఇద్దరి పరిస్థితి ఇప్పుడు ఒకేలా ఉంది కూడా. ఎందుకంటే బ్రూస్ లీతో శ్రీనువైట్లకి, అఖిల్ తో వినాయక్ కి సాలిడ్ దెబ్బలు తగిలాయి. కోలుకోలేని ఫ్లాప్ లతో ఇద్దరికి గడ్డుకాలం ఎదురైంది. నిజానికి వీరి గత చిత్రాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ వీీరి మీద ఉన్న నమ్మకంతో ఈ రెండు చిత్రాల మీద భారీ నమ్మకం క్రియేట్ అయ్యింది. ఆ నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్లు భారీగా వెచ్చించి ఆయా సినిమాలను కొనుగోలు చేశారు. ఓవైపు చెర్రీ కెరీర్ లో అత్యధికంగా బ్రూస్ లీని 55 కోట్లకు, అలాగే అఖిల్ డెబ్యూ మూవీపైనే దాదాపు సేమ్ అదే రేట్ కు నిర్మాతలు అమ్ముకున్నారట. అయితే ఫలితం రివర్స్ అయ్యి ఆ రెండూ బొక్కాబోర్లాపడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వైట్ల కన్నా వినాయక్ బెటర్ గా, సానుకూలంగా స్పందించి బయ్యర్లు నష్టపోకుండా ముందుకు వచ్చాడట. తన రెమ్యునరేషన్ లో మిగిలిన 3 కోట్లను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మాతలతో వినాయక్ చెప్పాడట. అంతటితో ఆగకుండా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు తన వంతుగా మరో 2 కోట్లను చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వైట్ల విషయానికొస్తే ఆగడు అట్టర్ ఫ్లాప్ అయ్యాక బయ్యర్లకు భయపడి అడ్రస్ లేకుండాపోయిన శీనువైట్ల ఇప్పుడు బ్రూస్ లీ విషయంలో అదే చేశాడు. అయితే నిర్మాత దానయ్య ఒత్తిడికి తలొగ్గి కేవలం 50 లక్షలను అతిబలవంతం మీద తిరిగి ఇచ్చినట్లు భోగట్టా. అలా తన చిత్రాన్ని నమ్ముకున్నందుకు నష్టపోకూడదని ఆలోచించి నిర్ణయం తీసుకున్న వినాయక్ ను సినీ పెద్దలంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారట.