ఈ మధ్య హీరో హీరోయిన్ లందరూ గాయకుల అవతారం ఎత్తేస్తున్నారు. తమన్, దేవిశ్రీప్రసాద్ వంటి సంగీత దర్శకులు తమ తమ హీరోలతో పాటలు పాడించడం సరదా కావడంతో ఇప్పటికే కొందరు తమ స్వరం వినిపించేశారు. అయితే దక్షిణాదిలో హీరోలతో పాడించినట్లుగా హీరోయిన్లతో పాటలు పాడించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించరు. స్వతహాగా సింగర్స్ అయిన నిత్యా మీనన్, శృతిహాసన్‌ని తప్పిస్తే దక్షిణాదిలో హీరోయిన్ లలో పాటలు పాడిన వారు బాగా తక్కువ. కానీ బాలీవుడ్‌లో మాత్రం అలా కాదు. అక్కడ హీరోయిన్లతో పాటలు పాడించడం ఇప్పుడు చాలా పరిపాటి అయిపోయింది. ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్, ఆలియా భట్‌లాంటి హీరోయిన్లు సింగర్లుగా తమ టాలెంట్ చూపించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇలియానా కూడా ఈ లిస్టులో చేరుతుందని సమాచారం. తన అప్ కమింగ్ మూవీలో ఇలియానాతో పాట పాడించేందుకు సంగీత దర్శకుడు నిర్ణయించుకున్నాడట. ఇలియానా స్వరం వినసొంపుగా ఉన్నప్పటికీ ఇంతవరకు ఎవరూ ఆమె టాలెంట్‌ని వాడుకోలేదని అంటున్నారు . తెలుగులో అన్నేళ్లు చేసినా కానీ ఇలియానా ఇక్కడ పాటలేం పాడలేదు. కానీ, ఇప్పుడు ఇలియానా టాలెంట్‌ని ముందుగా బాలీవుడ్ ఆవిష్కరిస్తోంది. ఆల్ ది బెస్ట్ ఇల్లీ...