జింగలాలా కోసం మహేష్ తాపత్రయం

November 20, 2014 | 03:53 PM | 30 Views
ప్రింట్ కామెంట్

లైఫ్ లో ప్రతీది పర్ ఫెక్ట్ గా ఉండాలి, దానికోసం ఎంతైనా ప్రయత్నించాలి. అప్పుడే లైఫంతా జింగలాలా. అంటూ మహేష్ ఈ మధ్య ఓ కమర్షియల్ యాడ్ లో సందడి చేశాడు. కరక్టే వరుస ఫ్లాప్ లతో మహేష్ ఇలా పర్ ఫెక్షనిజం కోసం ట్రై చేయడం సబబే. కానీ, ఇటీవల ఓ యాడ్ చిత్రీకరణలో మాత్రం ప్రిన్స్ ప్రవర్తన కొంచెం ఇబ్బంది కలిగించింది. రెయిన్ బో ఆస్పత్రి ప్రచారం కోసం మహేష్ ఓ యాడ్ లో నటించాడు. అయితే ఈ యాడ్ ఎంతకీ మహేష్ కు నచ్చకపోవడంతో ఏకంగా దర్శకుడినే మార్చి తిరిగి నటించడానికి రెడీ అయ్యాడట. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ యాడ్ ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో యాడ్ ను ముందు చిత్రీకరణ చేసిన డైరక్టర్ చాలా హర్ట్ అయ్యాడట. మహేష్ నీ జింగలాలా కోసం జనాల్ని ఇంతలా ఇబ్బందిపెట్టాలా అని ఇది గమనించిన వారంతా చెవులు కోరుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ