ఉత్తుత్తి పెళ్ళిచేస్తే ఉద్యోగం పీకేశారు

January 29, 2015 | 04:06 PM | 34 Views
ప్రింట్ కామెంట్

ఉత్తిత్తు పెళ్ళికోసం నటించినందుకు గాను ఓ ఇమామ్ ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డునపడ్డాడు. గత ఏడెళ్లుగా జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని బాబా దూవూద్ ఖాకీ మసీద్‌లో ఇమామ్‌గా పనిచేస్తున్న గులామ్ హసన్ షాని ఆ ఉద్యోగం నుంచి పక్కనపెట్టేశారు వారి మత పెద్దలు. కారణం షాహీద్ కపూర్ నటిస్తున్న చిత్రం 'హైదర్‌'లో ఓ పెళ్ళి సీన్ లో అతను నటించడమే నట. ఆయన హైదర్ మూవీలో హీరోయిన్ టబుకి నిఖా(పెళ్లి) జరిపించడమే. అది కూడా రియల్ లైఫ్‌లో కాదు.. జస్ట్ సినిమాలో మాత్రమే. సినిమాలో నటించడంతోపాటు మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఇలా నిఖా జరిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మతపెద్దలు ఇకపై ఆ ఇమామ్ తమ మసీదులో పనిచేయడానికి వీల్లేదంటూ ఆదేశించారు. కేవలం అవగాహన కోసమే మసీదుని, తనని ఉపయోగించుకుంటానని అనుమతి తీసుకున్న ఆ సినిమా దర్శకుడు విశాల్ భరద్వాజ్.. తననిలా సినిమా కోసం వాడుకుని చివరకు తన ఉద్యోగం పోవడానికి కారకుడయ్యాడని పేర్కొంటూ ఇమామ్ కోర్టుకెక్కాడు. దేశ వ్యాప్తంగా ఎంతో పేరున్న దర్గా మసీద్ బాబా దూవూద్ ఖాకీ. అటువంటి మసీద్‌కి మచ్చతెచ్చేలా విశాల్ భరద్వాజ్ వ్యవహరించాడు కనుక జాతీయ మీడియాలో మూడు వేర్వేరు సందర్భాల్లో అందుకు బదులుగా ఆయన తమకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే రూ. 50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంటూ సదరు ఇమామ్ తన అడ్వకేటుద్వారా మూవీ డైరెక్టర్ విశాల్‌కి నోటీసులు ఇప్పించాడు. ఈ వ్యవహారంపై విశాల్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ