పాక్ నటిపై ఇండియన్ దర్శకుడి అత్యాచారం... అరెస్ట్

February 22, 2016 | 11:29 AM | 3 Views
ప్రింట్ కామెంట్
director-raped-pak-actress-niharonline

సొంత దేశంలో అంతగా పేరు రాకపోవటంతో కనీసం భారత చిత్రాల్లోనైనా పేరు తెచ్చుకుందామని వచ్చిన ఆ నటి రాబం(కామం)దుల చేతికి చిక్కింది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి శారీరకంగా వాడుకోవటమే కాకుండా, పెద్ద మొత్తంలో డబ్బును స్వాహా చేశాడో దర్శకుడు. అవకాశాల పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పాకిస్థాన్‌ నటి  ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

                      మూడేళ్ల క్రితం ఓ సినిమా ఫంక్షన్ లో పరిచయమైన ఈ పాకిస్తానీ నటిని(30) ఓ భోజ్ పురి దర్శకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు ఇస్తానని మభ్యపెట్టాడు. ఆపై మత్తుమందు కలిపిచ్చిన డ్రింక్ తో లైంగిక దాడి చేశాడు. ఆపై పలుమార్లు ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. అంతేకాదు సినిమా నిర్మాణానికి ఆమెనుంచి రూ. 35.80 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 

ఓవైపు నెలలు గడుస్తున్నప్పటికీ సినిమా అవకాశం ఇవ్వకపోగా, అప్పుగా తీసుకున్న డబ్బులు కూడా చెల్లించక ముఖం చాటేశాడు. దీంతో ఆమె గట్టిగా అతగాడిని నిలదీసింది. ప్రతిగా తన సహచరులతో కలిసి ఆమెను బెదిరించాడు. చివరికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదుచేసుకుని నిందితుడి అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.కాగా, వారికి రాజకీయ నేతల అండ ఉండటంతో పేర్లు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ