కేన్స్ లో మన సినిమా ఖ్యాతి

May 21, 2015 | 04:43 PM | 52 Views
ప్రింట్ కామెంట్
masaan_cannes_selected_bollywood_movie_niharonline

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన భారతీయులు ఆహ్వానింపబడడం, అక్కడ రెడ్ కార్పెట్ పై  హొయలొలికించడం.... మన బాలీవుడ్ భామల గురించి అక్కడి జనం పొగుడుతుంటే మురిసి పోవడం ఒక్కటే కాదు, అంతర్జాతీయంగా చలన చిత్రాలను ఎన్నిటినో అక్కడ ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో కొన్ని సినిమాలను ఎంపిక చేయడమే చాలా గొప్ప గౌరవంగా భావిస్తారు. అలాంటిది అక్కడికి విచ్చేసిన అతిథులు ఆ సినిమాలకు పొగడ్తల వర్షం కురిపిస్తే అంతకంటే గొప్పతనం మరేముంటింది?  మన ఇండియన్ సినిమాలను చాలా అరుదుగా ప్రదర్శించడం,... ప్రశంసలు పొందడం జరుగుతుంటుంది. అయితే ఈసారి రిచా చద్దా నటించిన ‘మసాన్’ అనే సినిమాను కేన్స్ లో ప్రదర్శించారు. అందరూ సైలెంటుగా సినిమా చూసి, సినిమా అయిపోయాక మొత్తం ఆడిటోరియం అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారట. సినిమా యూనిట్ ను పొగడ్తలతో ముంచారట. స్టాండింగ్ ఒవేషన్ లో ఐదు నిమిషాలు ఆపకుండా చప్పట్లు కొట్టడం మన ఇండియాకు 68వ కేన్స్ ఫెస్టివల్ లో దక్కిన అపురూప గౌరవంగా భావించవచ్చు. అతిథుల స్పందన చూసి రిచా చద్దాతో పాటు డైరెక్టర్ నీరజ్ ఘయ్ వాన్ ఉద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకున్నారట. అయితే మసాన్ అనే సినిమా ఒకటి తయారవుతోందని బాలీవుడ్ జనాలకు ఏ మాత్రం తెలియదు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాకే.. ఇలాంటి సినిమాల గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఈ మసాన్ లో ఉన్న గొప్పదనం ఏమిటో... అది మనం తెరమీద చూడాల్సిందే...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ