‘బాహుబలి’ సినిమా ఇప్పుడు పీకేను తలదన్నేసింది. ఇండియా మొత్తం మీద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా బాహుబలి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఒక ప్రాంతీయ భాషా సినిమా అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఘనత దర్శకుడు రాజమౌళిదే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ విజువల్ వండర్స్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వీక్షిస్తున్నాయి. జూలై 10న తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో ఒకేసారి పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా అన్నిచోట్లా రికార్డు కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్ లో 570 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి మూడో స్థానంలో ఉంది. పీకే, భజరంగీ భాయ్‌జాన్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక హిందీ సినిమా మార్కెట్ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ సాధించడం పలు హాలీవుడ్ మ్యాగజైన్‌లను సైతం ఆశ్చర్యపరచింది. బాహుబలి బాక్సాఫీస్ ప్రభంజనాన్ని ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక కూడా కొనియాడింది. ఓవరాల్ గా మూడో స్థానంలో ఉన్నా ఇండియన్ మార్కెట్లో మాత్రం పీకే, భజరంగీ భాయ్‌జాన్ సినిమాలను పక్కన పెట్టి టాప్‌లో నిలవడం ఆసక్తికర అంశం. ఇండియన్ మార్కెట్లో బాహుబలి 500 కోట్లు కలెక్ట్ చేయగా, పీకే, భజరంగీ సినిమాలు 450 కోట్ల దగ్గరే ఆగిపోయాయి.