అల్లు అర్జున్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. యూత్ హీరోల్లో బన్నీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆర్య సినిమా అనువాదం ద్వారా బన్ని మలయాళం ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. కానీ ఇప్పటిదాకా నేరుగా మలయాళ సినిమాలు చేయలేదు. అతని ఏకాగ్రత పూర్తిగా తెలుగుమీదే ఉంది. కానీ ఇటీవల ఏబీసీడీ2తో హిందీలో ఎంట్రీ ఇచ్చాడని వినికిడి. అంతటితో ఆగకుండా బన్నీ ప్రస్తుతం తమిళ మార్కెట్ పై కూడా కన్నేస్తున్నాడు. అదీ లింగుస్వామి సినిమాతో. ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన చివరి పాటలో నటిస్తున్నాడు. ఈ పాట పూర్తయితే బన్ని వెర్షన్ పూర్తయినట్టే. ఈ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పేశాడు బన్ని. సో సన్నాఫ్ సత్యమూర్తి పనులు బన్నీకి ఇక లేవు. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా మొదలుకానుంది. ఆ సినిమా షూటింగ్ అక్టోబర్, నవంబర్‌కు పూర్తవ్వాలన్నది ప్లాన్. దాని తర్వాత బన్ని చేయబోయే సినిమా ద్విభాషా సినిమా. అదే లింగుస్వామి దర్శకత్వంలో అన్నమాట. లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటించిన సికిందర్ గతేడాది పెద్ద ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తిరుపతి బ్రదర్స్ పతాకంపై సినిమాలను నిర్మిస్తున్న లింగుస్వామికి ప్రస్తుతం డైరక్షన్ మీద గ్రిప్ జారుతోందన్నది కోలీవుడ్ టాక్. ఇలాంటి నేపథ్యంలో బన్ని తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? బన్నీ డేట్లు ఇవ్వాలేగానీ వైవిద్యమైన సినిమాలు చేయడానికి తెలుగు దర్శకులు క్యూలో ఉన్నారు. వారందరినీ కాదని హీరో ఎందుకు ఇలా చేస్తున్నారంటే సర్వత్రా వినిపించే ఒకే సమాధానం మార్కెట్‌ని పెంచుకోవాలి.. రేంజ్‌ను పెంచుకోవాలి అన్నది. నిజమే సినిమా పరిశ్రమలో రిస్కులు చేయకపోతే నెక్స్ట్ లెవల్ అనేది కష్టమే. కానీ రిస్క్ లో కూడా కాసింత సేఫ్ రిస్క్ ఉండేలా చూసుకోవాలన్నది సన్నిహితుల సూచన. మొదటికే మోసం రాకూడదన్నది హితవు. కాబట్టి ఇతర భాషలో తొలిసారి లాంచ్ అవుతున్నప్పుడు ఫస్ట్ సేష్టీ చూసుకోవాలన్నది కీలకం. బన్ని ఇప్పుడు సన్నిహితుల మాట వింటారా? లేకుంటే తాననుకున్నట్టు ముందుకు వెళ్తారా అనేది చూడాలి. ఏదేమైనా తెగించి నిర్ణయం తీసుకున్న బన్నికి అంతా శుభమే జరగాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్.