మహేష్ దర్శకుడితో వేషాలు వేయిస్తారంట!

March 24, 2016 | 12:18 PM | 3 Views
ప్రింట్ కామెంట్
JayanthCParanji-maheshbabu-villian-murugadoss-niharonline

ఒక వైపున మహేశ్ బాబు కథానాయకుడిగా రానున్న 'బ్రహ్మోత్సవం' సినిమా కోసం ఎదురు చూస్తోన్న అభిమానులు, మరో వైపున ఆయన తదుపరి సినిమాపై దృష్టిపెట్టారు. 'బ్రహ్మోత్సవం' సినిమా తరువాత మురుగదాస్ తో మహేశ్ బాబు ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లలో మురుగదాస్ నిమగ్నమై వున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలన్ పాత్రకి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. మహేశ్ బాబుకి విలన్ గా ఒక దర్శకుడు నటించనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ దర్శకుడు ఎవరై ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జయంత్ సి.పరాన్జీ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో  'టక్కరి దొంగ' సినిమా తెరకెక్కి పోయింది. అయితే జయంత్ ఫ్రెంచ్ గడ్డంతో లుక్ కూడా డిఫరెంట్ గా ఉండటంతో ఆయనను ఫైనలైజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చని అనుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ