ఇదయదళపతి బాహుబలిని కొట్టేశాడు

March 24, 2016 | 11:27 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Theri-Beat-Baahubali-trailer-record-niharonline

'బాహుబలి' ట్రైలర్ ను విడుదల చేసిన దగ్గర నుంచి, మరే సినిమా ట్రైలర్ అయినా దానిని బీట్ చేస్తుందా? అని అంతా అప్పటి నుంచీ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన 'సర్దార్ గబ్బర్ సింగ్' ట్రైలర్ రెస్పాన్స్ చూసి, 'బాహుబలి' ట్రైలర్ రికార్డును అధిగమించే అవకాశం వుందని అభిమానులు అనుకున్నారు.

                   కానీ, 'సర్దార్' మాట అటుంచితే .. విజయ్ కథానాయకుడిగా చేసిన 'తెరి' చిత్రం ట్రైలర్ మాత్రం 'బాహుబలి' ట్రైలర్ రికార్డును బీట్ చేసింది. గతంలో 'బాహుబలి' ట్రైలర్ కి 24 గంటల్లో 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక విజయ్ కథానాయకుడిగా అట్లీ తెరకెక్కించిన 'తెరి' సినిమా ట్రైలర్, 21 గంటల్లోనే 'బాహుబలి' ట్రైలర్ రికార్డును అధిగమించింది. మొత్తానికి బాహుబలి ట్రైలర్ రికార్డుని బీట్ చేసిన ఘనత తమిళ చిత్రానికి దక్కింది. సమంతా .. ఎమీ జాక్సన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, విజయ్ కూతురుగా .. మీనా కూతురు 'నైనిక' కనిపించనున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ