జయసుధ తనయుడు శ్రేయాన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘బస్తీ’. నేషనల్ లెవల్ స్పోర్ట్స్ మన్‌గా పలు మెడల్స్ అందుకున్న శ్రేయాన్ ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గురువారం ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్‌కు జయసుధ దంపతులు హాజరయ్యారు. వాసు మంతెన దర్శకనిర్మాణంలో లవ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమా కేవలం 36 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది ప్రగతి హీరోయిన్‌గా నటించే ఈ చిత్రానికి శ్రేయాన్ స్వయంగా డబ్బింగ్ చెప్పాడట. ప్రవీణ్ ఇమ్మడి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక ఈనెల 21న జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆడియో వేడుకకు తెలంగాణ సీఎం కేసీఆర్ ను ముఖ్యఅతిధిగా ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.