కళ్యాణ ద్రోహం తగదంటున్నవర్మ

June 19, 2015 | 03:59 PM | 1 Views
ప్రింట్ కామెంట్
varma_satires_on_pawan_kalyan_niharonline

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచనల వార్త ట్వీటాడు.  ఇప్పుడు వార్తల్లో మార్మోగుతున్న నోటుకు ఓటు పై పలువురు తమ కామెంట్లను గుప్పిస్తుంటే... పదవులు లేకుండా ప్రజలకు సేవ చేస్తానన్న పవన్ కళ్యాణ్ పై ఆయన దృష్టి పడినట్టుంది... మరి ఇంత పెద్ద విషయంపై ఈ నెంబర్ వన్ స్టార్ , రాజకీయ వేత్త అయిన పవన్ కామెంట్ చేయకపోవడం ఆయనకు వెలితిగా అనిపించినట్టుంది అందుకే ఆయనపై నొప్పించక తానొవ్వక అన్న రీతిలో స్పందించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించడం మానేసిన పవన్ కళ్యాణ్ కు అతడి ధర్మాన్ని నెరవేర్చమని హితబోధ చేస్తున్నాడు . ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ ప్రస్తుత పరిస్థితి పై ప్రశ్నించకుండా సైలెంట్ గా ఉండటంతో పవన్ ని ప్రశ్నిస్తున్నాడు వర్మ . ''పాలకుల్ని ప్రశ్నిస్తాననేవాడు ప్రశ్నించనప్పుడు కళ్యాణం కోరుకునే జనాలకు పెళ్ళెప్పుడు ?'' , ''ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు లోక కల్యాణానికి ద్రోహం ...... ఇది కళ్యాణద్రోహం '' అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసి పవన్ పై విమర్శలను ఎక్కుపెట్టాడు . మరి పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి .

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ