బాంబు పేలుడుకు కూతంత దూరంలో జెన్నీ

August 18, 2015 | 03:12 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Genelia_safe_niharonline

పెళ్ళి చేసుకుని, ఇక సినిమాలకు స్వస్తి పలుకుతుందేమో అనుకున్న సమయంలో ఓ బిడ్డకు తల్లిగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించిన జెనీలియా మళ్ళీ తెరమీదకు వస్తున్నానంటూ ప్రకటించింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత మేకప్ వేసుకొని ఓ యాడ్ షూట్ కోసం  బ్యాంకాక్ వెళుతూ ట్విట్టర్ లో ఈ సమాచారం పంచుకొంది. బ్యాంకాక్ లో ఓ సర్ ప్రైజ్ కూడా ఉందని చెప్పింది. అక్కడికెళ్లాక ఆమె ఏదైనా కొత్త న్యూస్ వినిపిస్తుందేమో అని అంతా ఎదురు చూస్తున్న సమయంలో...  అనుకొన్నట్టుగానే ఓ స్టార్ తో కలిసి యాడ్ చేస్తున్నా అని చెప్పింది. ఇంకా సినిమా న్యూస్ కూడా వినిపిస్తుందేమో అనుకొనేంతలోపే ఆమె నుంచి ఓ ప్రమాదానికి సంబంధించిన వార్త వినాల్సివచ్చింది. బ్యాంకాక్ లో సోమవారం జరిగిన ఓ బాంబ్ బ్లాస్ట్ లో జెనీలియా ప్రమాదం నుంచి తప్పించుకుంది. 
జెనీలియా అండ్ టీమ్ షూటింగ్ చేసుకొంటున్న  షాపింగ్ మాల్ కి సమీపంలోనే శక్తివంతమైన పేలుడు సంభవించిందట. వెంటనే జెనీలియా ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని బయట పెట్టింది. ప్రమాదమైతే తప్పింది కానీ... ఇక్కడ పరిస్థితి మాత్రం భయానకంగా ఉందని ఆమె ట్విట్ చేసింది. ప్రమాదం వార్త తెలిసినప్పట్నుంచి జెనీలియా గురించి ఆమె భర్త రితేశ్ దేశ్ముక్ కి సన్నిహితులంతా ఫోన్ చేశారట. జెనీలియా ఎలా ఉంది? అని అడిగారట. జెనీలియాకి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసి ఆమె అభిమానులు రితేశ్ అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. మంగళవారం ఉదయం కూడా జెనీలియా `మేం సేఫ్`గా ఉన్నామని ట్వీట్  చేసింది. పట్టలేనంత ఆనందంతో బ్యాంకాక్ వెళ్లిన జెనీలియా ఈ బాంబ్ బ్లాస్ట్ కారణంగా అప్సెట్ అయ్యింది. దేవుడు దయ వల్ల మేం బతికి పోయామని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది.  ప్రమాదంలో చనిపోయిన వారి గురించి విచారం వ్యక్తం చేసింది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ