అజార్ లో ఆ అఫైర్ ఉందా... లేదా?

May 11, 2016 | 12:21 PM | 2 Views
ప్రింట్ కామెంట్
jwala-gutta-affair-azhar-movie-niharonline

మణికట్టు మాంత్రికుడు, ఇండియన్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ జీవిత చరిత్ర తెరపై చూసేందుకు మరో రెండు రోజులే ఉంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో వివాదాస్పదమైన అంశాలను కూడా ఇందులో చూపించినట్లు దర్శకుడు టోనీ డిసౌజా మెల్లిగా చెప్పేస్తున్నాడు. అయితే అవేం అజార్ ప్రతిష్టను భంగపరిచేలా ఉండవని భరోసా ఇస్తున్నాడు. ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్ లో కనిపిస్తుండగా, అజార్‌ మొదటి భార్య నౌరీన్ పాత్రలో ప్రాచీ దేశాయ్‌, రెండో భార్య సంగీతా బిజ్‌లానీ పాత్రలో నర్గీస్‌ ఫక్రీ కనిపించనున్నారు. క్రికెట్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టడం అంతా పక్కా చూపించబోతున్నాడంట. ఇప్పటికే చిత్ర ప్రత్యేక ప్రివ్యూ చూసిన అజార్ స్వయంగా చిత్ర ప్రమోషన్లో పాల్గొనేందుకు ముందుకు రావటం విశేషం. అయితే ఇప్పడు ఓ హాట్ అఫైర్ ఇందులో చూపిస్తారా లేదా అన్నది ప్రశ్నగా ఉంది.

                                            గతంలో అజారుద్దీన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలాతో ప్రేమ వ్యవహారం నడిపినట్లు వదంతులు వచ్చాయి. ఇద్దరు కార్లో షికార్లు చేసినట్లు మీడియాలో కూడా వీడియోలు దర్శనమిచ్చాయి. కొంతకాలం తర్వాత అజార్ తోకాదు ఆయన కొడుకుతో అని మరోక వార్త వచ్చింది. తాజాగా ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించేందుకు సూరత్ కు వెళ్లిన గుత్తా జ్వాల మీడియా వేసిన ప్రశ్నకు ఆగ్రహంతో ఊగిపోయింది. గతంలో ఆమెకు భారత జట్టు క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తో అఫైర్ ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై ఆమెను ప్రశ్నించగా, ఆమె మండిపడింది. "అదంతా ఓ రూమర్. మీరంతా పదే పదే అదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు? గతంలో ఎన్నోసార్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాను కదా? వదిలిపెట్టరా?" అంటూ అంతెత్తున ఎగిరి పడింది. మరి సినిమాలోనైనా అఫైర్ ఎవరితో అన్నది క్లారిటీగా చూపిస్తారా తెలియాలంటే శుక్రవారం దాకా ఓపికపట్టాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ