బంగారు బాబు గ్యాప్ లో దూరిపోతున్నాడు

May 11, 2016 | 11:17 AM | 2 Views
ప్రింట్ కామెంట్
babu-bangaram-likely-to-release-in-july-niharonline

సోలో హీరోగా వెంకీ సినిమా తీసి చాలా ఏళ్లు అయ్యింది. సీతమ్మ వాకిట్లో, గోపాల గోపాల రెండు మల్టీస్టారర్ కావటంతో విక్టరీ అభిమానులు సింగిల్ గా వెంకీని చూసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి నయనతార ఇందులో నాయికగా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేశ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జూలై లో విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా చెబుతున్నారు. జూలైలో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవటం బంగారు బాబుకి కలిసొచ్చే అంశం. జూన్ మూడోవారంలో ఆడియో రిలీజ్ చేసి, నెల గ్యాప్ లో చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నారు. 'భలే భలే మగాడివోయ్' సినిమా తరువాత మారుతి చేస్తోన్న సినిమా కావడం వలన, గతంలో వెంకీ - నయనతార కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ కావడం కూడా ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ