మొన్నటి వరకూ బాహుబలి సినిమాకు సినిమా రంగంలోని వారితో పాటు రాజకీయ, వ్యాపార రంగంలోని వారు కూడా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు శ్రీమంతుడు సినిమా రాజకీయ నాయకులకు స్ఫూర్తినిచ్చే సినిమా అయినప్పటికీ వారి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రశంసలు రాలేదు గానీ ఈ సినిమాను మొదట వెంకయ్యనాయుడు మెచ్చుకుంటే,,, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. శ్రీమంతుడు సినిమా స్ఫూర్తి దాయకమైన చిత్రం అని అన్నారు. సర్కారు గ్రామ జ్యోతి పథకం తీసుకువస్తున్న సమయంలోనే ఈ సినిమా రావడం, ఈ సినిమాలోనూ గ్రామాభివృద్ధి, సామాజిక బాధ్యత వంటి అంశాలను సృజించడం ఎంతో బావుందని అన్నారు. ‘‘మంచి సినిమా మహేష్ బాబూ’’ అంటూ ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే హీరో మహేష్ బాబు కూడా స్పందిస్తూ ‘‘థ్యాంక్యూ కేటీఆర్ సర్..’’ అంటూ బదులిచ్చారు.