గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. 9 నుంచి ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ఆరంభమవుతుందని సమాచారం. ఒక్క హీరోయిన్ల విషయం తప్పించి మిగతా నటీనటుల విషయంలో క్రిష్ ఎంపిక చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పటికే రాజమాత పాత్ర కోసం హేమా మాలిని ఓకే చేసిన క్రిష్ ఇప్పుడు మరో బాలీవుడ్ నటుడ్ని సినిమా కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం సీనియర్ నటుడు కబీర్ బేడీని తీసుకుంటున్నట్లు వార్త. భారీ బడ్జెట్ చిత్రం కావటంతో దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయాలని ఇందుకోసం మరికొంత మంది బాలీవుడ్ నటీనటులను ఎంపిక చేయనున్నట్లు భోగట్టా. అంతేకాదు హీరోయిన్లలో కూడా ఒకరిని బాలీవుడ్ నుంచే ఎగుమతి చేసే ఛాన్స్ ఉందట కూడా. సెట్స్ కూడా ఎక్కువ ఖర్చవుతుందన్న ఆలోచనతోనే పురాతన చారిత్రక కట్టడాలు ఎక్కువగా వున్న మొరాకోలో షూటింగ్ ను ఏర్పాటు చేశాడు. ఆయుధాల విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడంట. చూస్తుంటే బాలయ్య 100వ చిత్రం భారీగా ప్రత్యేకతలను సంతరించుకునే అవకాశం లేకపోలేదు.