నటి కాజల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఇనాళ్లు పెద్ద పెద్ద స్టార్లతో నటించినప్పటికీ ఎక్స్ పోజింగ్ విషయంలో కొన్ని కట్టుబాట్లు పాటించింది ఈ చందమామ. ఇటీవల చరణ్ తో కలిసి నటించిన గొవిందు అందరివాడేలే కూడా సంప్రదాయమైన దుస్తులతో అలరించింది. అయితే ఏజ్ బార్ అయిపోతుండటం, అవకాశాలు కూడా అంతంత మాత్రం ఉండటంతో ఇక లాభం లేదనుకుందో ఏంటో స్కిన్ షో కి రెడీ అయిపోయింది. పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న టెంపర్ చిత్రంలో ఓ పాటలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిందని టాక్. ఇటీవల అవకాశాలు తగ్గిపోవడంతో సమంత కూడా ఇలాగే అల్లుడు శీను, సికిందర్ సినిమాలలో తెగచూపించేసింది. ఇప్పుడు కాజల్ కూడా అదే బాటలో నడుస్తుందేమో అనిపిస్తుంది. వయసు పైబడుతుందనో, అవకాశాలు రావట్లేదనో ఇలా తెగించేయడం సరైందేనంటారా.