పవన్ కు లస్సీ పాపే కావాలంటా

November 21, 2014 | 12:33 PM | 39 Views
ప్రింట్ కామెంట్

టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఉన్న పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు మరో అనుకోని బంఫర్ అవకాశం తలుపు తట్టనుంది. గబ్బర్ సింగ్-2 చిత్రంలో రెండో కథానాయికగా రకుల్ పేరును పరిశీలిస్తున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 చిత్రంలో అనిషా అంబ్రోస్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్ కి తలొగ్గిన దర్శకుడు బాబీ చిత్రంలో మరో కథానాయిక వేటలో పడ్డాడు. చిత్రంలో అనిషాది సంప్రదాయాలు తెలిసిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో అలరిస్తుందని, మరో హీరోయిన్ తో గ్లామర్ ఒలికించేందుకు ప్రయత్నించాలని దర్శకుడు చూస్తున్నాడట. పవన్ మాత్రం సెకండ్ హీరోయిన్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను రికమండ్ చేశాడని సమాచారం. వరుస హిట్లతో జోరు మీదున్న ఈ పంజాబీ భామ సినిమాలో ఉంటే మంచి ఫ్లస్ పాయింట్ అవుద్దని పవన్ దర్శకుడికి సూచించాడట. మరి కుర్ర హీరోలతో వరుసపెట్టి హిట్లు కొడుతున్న పంజాబీ లస్సీ రకుల్ పవర్ స్టార్ తో స్క్రీన్ పై ఏ మేర రొమాన్స్ చేస్తుందో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ