కాజల్ ఇప్పటికే ఎన్నో ఎన్జీవో సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సినీ తారలు సమాజ సేవలో భాగం పంచుకుంటూ తమ వంతుగా సేవ చేస్తున్నారిప్పుడు. కాజల్ ఇప్పటికే విద్యలో వెనుకబడిన పిల్లల్ని చదివించే ప్రయత్నంలో తనవంతుగా కృషి చేస్తోంది. అయితే ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. దాదాపు 40 దేశాల్లో 20 మిలియన్ల పిల్లలు ఈ ఫౌండేషన్ సేవల్ని వినియోగించుకుని గొప్ప గొప్ప వాళ్ళయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా అనాథ పిల్లలను ఈ సంస్థ దత్తత తీసుకుని చదివిస్తోంది. ఈ సంస్థ కేవలం విద్య మాత్రమే కాకుండా వారి ఆలనా పాలనలో అన్ని రకాలుగానూ ఆదుకుంటోంది. అంత పెద్ద సంస్థ తరఫున కాజల్ ప్రచార కర్తగా ఎంపికైనందుకు తాను చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది. డెక్స్టిరిటీ ఫౌండేషన్ కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. యునైటెడ్ నేషన్స్ యూత్ ఐకన్ పురస్కారాన్ని సైతం అందుకుంది ఈ సంస్థ. అంత గొప్ప సామాజిక సేవా సంస్థతో కలిసి పని చేయడం తన అ దృష్టంగా భావిస్తున్నానని ఉబ్బితబ్బిబ్బవుతోంది కాజల్. ఇంత మంది సినీ తారలుండగా అంత గొప్ప సంస్థకు పనిచేసే అవకాశం కాజల్ కు రావడం నిజంగానే ఇది చాలా గొప్ప విషయంగా భావించాలి.