విజేతలైన తెలుగు వారియర్స్

February 02, 2015 | 12:49 PM | 34 Views
ప్రింట్ కామెంట్

సిసిఎల్-5 కప్పును మన తెలుగు వాళ్ళు గెలుచుకోవడంతో సినీ పరిశ్రమతో పాటు మన తెలుగు వాళ్ళు కూడా ఆనందంగా పండుగ చేసుకున్నారు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నయ్ రైనోస్ తో పోటీ పడి చివరికి కప్పును తెలుగు వారియర్స్ దక్కించుకున్నారు. ఒకప్పుడు సినిమా వాళ్ళు చారిటీ కోసం క్రికెట్ ఆడేవాళ్ళు. అది కేవలం సినిమా వాళ్ళను చూడ్డానికే తప్ప గేమ్ లో సీరియస్ నెస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు హీరోల్లో కొందరు మాంచి ప్లేయర్లున్నారు. సిసిఎల్ గేమ్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆడుతున్నారు. దాదాపు 22-20 క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ ఇప్పుడు సిసిఎల్ కు కూడా ఉందంటే ఆశ్చర్యపోనక్కరలేదు. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్నారు తెలుగు వారియర్స్. చెన్నయ్ రైనోస్ 20 ఓవర్లలో 132 పరుగులే చేయగలిగింది. ఇంకా రెండు ఓవర్లు ఉండగానే 132 పరుగుల లక్ష్యానికి చేరుకుని విజేతలయ్యారు తెలుగు వారియర్స్. అసలే అభిమాన హీరోలు. ఇక క్రికెట్ లో ఇరగ దీస్తుంటే ఉత్సాహంతో ఎగబడి చూసేస్తున్నారు సిసిఎల్ మ్యాచ్ ను. తెలుగు వారియర్స్ లో ఇప్పుడు అఖిల్ కు థోనీకున్నంత క్రేజ్ పెరిగిపోయింది. తెలుగు వాళ్ళలో మంచి ప్లేయర్స్ చాలా మందే ఉన్నారు. రాను రాను తెలుగు వారియర్స్ మరింత అంటే 20-20తో పోటీ పడేంత బలంగా తయారవుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ