యూనివర్సల్ హీరో కమలహాసన్ మళ్లీ గొంతు సవరించుకుంటున్నాడా?. ఓ తమిళ సినిమాకి పాడటం కోసం ఆయన రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ పాటని ఆయన పాడితే బాగుంటుందని ఇళయరాజా సూచించడం విశేషం. కోలీవుడ్లో ఒకప్పుడు హీరోగా కార్తీక్ ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కొడుకు గౌతమ్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ తండ్రీకొడుకులిద్దరూ 'ముత్తు రామలింగ' అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాకి రాజదుర దర్శకుడిగా, ఇళయరాజా సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ను పాడే గాయకుడి వాయిస్ గంభీరంగా ఉండాలనీ, కాబట్టి కమల్ పాడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇళయరాజా వ్యక్తం చేశాడట. అంతేకాదు కార్తీక్ కమల్ కి మంచి ఫ్రెండ్ కూడా. సో... వీరిద్దరి అడిగితే కమల్ ఖచ్ఛితంగా కాదనడు. ఇప్పటివరకు కమల్ తన సినిమాలకు తప్ప వేరే ఎవరికీ గొంతు ఇవ్వలేదు. కాబట్టి ఇది ఖచ్ఛితంగా ప్రత్యేకమే.