మరో 4 నెలల్లో తల్లవుతున్న కామ్నాజఠ్మలాని

September 23, 2015 | 12:51 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Kamna-Jethmalani-becoming-a-mother-niharonline

చంద్రిక సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో నటించిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ మీడియాకు ఓ శుభవార్త చెప్పేసింది. తానిప్పుడు ఐదు నెలల గర్భవతినని, బేబీ కోసం మరో నాలుగు నెలలు వేచి చూడ్డం చాలా ఎగ్సైటింగ్ గా ఉందని సంతోషంగా చెప్పుకుంది. ఇటీవల సినిమా వాళ్ళలోనూ చాలా మార్పులు వచ్చేసాయి. చాలా మంది తల్లవుతున్న సంగతి చెప్పుకోరు. తమ ప్రొఫెషన్ కు ఇదొక ఆటంకం అనుకుంటారు. కానీ తల్లయ్యే ఆ గొప్ప అనుభూతిని ఇప్పటి హీరోయిన్లు కొందరు దాచుకోవడం లేదు. ప్రొఫెషన్ కన్నా ఆ అనుభూతి చాలా గొప్పదని భావించడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. ఇటీవల హీరోయిన్ స్నేహ దంపతులు, జెనిలియా దంపతులు గర్భం దాల్చింది మొదలు బేబీ పుట్టుక... పేర్లు పెట్టుకోవడం అన్నీ మీడియాతో షేర్ చేసుకుని ఆనందించారు. కామ్నా జఠ్మలానీ గతేడాది సూరజ్ నాగ్ పాల్ అనే బిజినెస్‌మేన్‌ని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్ళి అట్టహాసం లేకపోయినా... తల్లి కాబోతున్న అనుభూతిని మాత్రం బాహాటంగా చెప్పుకుంటోంది కామ్నా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ