బీ టౌన్ క్వీన్ 11 కోట్ల డిమాండ్

August 21, 2015 | 11:51 AM | 6 Views
ప్రింట్ కామెంట్
kangna_demands_11_crores_niharonline

క్వీన్ సినిమా ఆమెను బాలీవుడ్ క్వీన్ గా మార్చేసింది. ఈ అమ్మడు పట్టిందల్లా బంగారం అవుతుండడంతో ఇండియన్ టాప్ హీరోయిన్  అయిపోయింది. అన్నట్టు ఈవిడ మన తెలుగులోనూ ఓ సినిమా చేసింది. ప్రభాస్ తో ఏక్ నిరంజన్ లో హీరోయిన్ గా నటించిన కంగన రనౌత్ గుర్తుంది కదా... నటనలో లీనమైపోయి నటించేస్తుంది ఈ భామ. ఇప్పుడు బీ టౌన్ లో దీపిక ప్రియాంక చోప్రా లాంటి స్టార్లకు మించిన హీరోయిన్ అంటే కంగన రనౌత్ అనే చెప్పాలి. ఈమె నటనకు బీ టౌన్ మొత్తం ఫిదా అవుతోంది. అయితే ఈమెకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో ఓ సినిమాకు రూ.11 కోట్లు రెమ్యునరేషన్ అడిగిందట. ఈ వార్త అలా అలా అందరికీ తెలిసిపోయింది. మరి ఇందులో నిజమెంతో తెలుసుకోవాలిగా... అందుకే మీడియా వాళ్లు డైరెక్ట్ గా కంగనాను అడిగేశారట. నిజానికి ఇలా ఏ హీరోయిన్ ను అడిగినా.... అందులో నిజం ఉన్నా మాట దాటవేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు.  కానీ కంగన ముక్కుసూటి మనిషి కదా... అవును పాత్ర మనకు బాగా నచ్చినప్పుడు...అందులో లీనమై నటించేటప్పుడు డిమాండ్ చేయడంలో తప్పేంటని ప్రశ్నించిందట. దీంతో మీడియా వాళ్లు నోరుమూసుకుని బయట పడ్డారట. కానీ కంగన నటన ఎంత బాగా చేయగలదో ఆమెలో నిజాయితీ అంతే ఉంది మరి. అందుకేగా ఆ మధ్య ఓ ఫేస్ క్రీమ్ యాడ్ లో నటించమనీ... రెండు కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినా...ఇలాంటి యాడ్స్ లో నటించనని ఖచ్చితంగా చెప్పేసిందట... ఎందుకంటే.. ప్రజలను మభ్యపెడుతూ కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే ఇలాంటి మోసపూరిత యాడ్స్ అంటే ఆమెకు ఎంత మాత్రమూ నచ్చదట.  తన నటనతో కోట్లకు కోట్లు లాభాలు ఆర్జించే నిర్మాతల దగ్గర డిమాండ్ చేసి తీసుకోవడంలో తప్పేంటని ఆమె ఉద్దేశం కాబోలు. దీంతో ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా రెమ్యునరేషన్ అందుకుంటున్న వాళ్ళు కూడా కంగనను చూసి జలసీ పడాల్సి వస్తుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ