ఛీటింగ్ కేసులో ఆమె మళ్లీ అరెస్టయ్యింది

October 09, 2015 | 09:56 AM | 1 Views
ప్రింట్ కామెంట్
maria-susairaj-cheating-case-arrested-niharonline

తెరపై తమ నటనతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే నటీనటులు ఒక్కొసారి అసహ్యకరమైన పనులు చేసి దొరికిపోవటం మనం చూస్తూనే ఉంటాం. సిల్వర్ స్క్రీన్ పై రంగులు వేసుకుని అభినయించే వారి మేకప్ వెనుక మరో ముసుగును గనుక పరిశీలిస్తే షాక్ కి గురవ్వటం ఎప్పటికప్పుడూ అభిమానుల వంతు అవుతుంది. అలాంటి ఉదంతమే ఇప్పుడొకటి కన్నడ సినీ రంగంలో బయటపడింది.

మోడల్ నుంచి నటిగా మారిన కన్నడ నటి మోనికా అలియాస్ మరియా సుసైరాజ్ గురించి పెద్దగా పరిచయం లేనివారంటూ ఉండరు. ఒకవేళ తెలియకపోతే రాంగోపాల్ వర్మ నాట్ ఏ లవ్ స్టోరీ సినిమా చూస్తే తెలుస్తుంది. అందులో ఆమె ఏం యాక్ట్ చెయ్యలేదు. కానీ, ఆమె జీవితం ఆధారంగానే ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. బాయ్ ఫ్రెండ్ జెరోమే మాథ్యూ తో కలిసి టీవీ నిర్మాత నీరజ్ గ్రోవర్ హత్యకు పాల్పడింది మరియా. అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది. ఆ కేసులో మరియా మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చింది కూడా. అయితే మర్డర్ చేసినందుకు కాదులేండి, అందుకు సంబంధించి సాక్ష్యాలు ధ్వంసం చేసినందుకు.

ఇక ఇప్పుడు తాజాగా మోసానికి పాల్పడిన కేసులో గుజరాత్ పోలీసులు ఆమె అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజన్సీ ద్వారా కొంతమందికి హజ్ యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసింది. అయితే ఎంత వేగంగా చేసిందో... అంతే వేగంగా టిక్కెట్లను రద్దు చేసిందట. అంతేకాదు ఆపై వారి దగ్గరి నుంచి డబ్బు తీసుకున్నట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈవిధంగా ఆమె సుమారు రూ.2.60 కోట్ల మోసానికి పాల్పడిందని తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఆమెను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ