ఇప్పుడు ఎవరు ఏ రంగంలోంచి ఏ రంగంలోకి దూకుతున్నారో అర్థం కావడం లేదు... సినీ రంగంలోనే రైటర్లు నటులు, డాన్సర్లు డైరెక్టర్లు...అవుతున్నారు... ఇంకా అదే రంగంలో అటూ ఇటూ దూకడం మామూలే... ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ మెన్ కూడా సినీరంగంలోకి దూకాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సినీ గీత రచయిత అయిపోయారు. ‘జైనాబ్- ఏ సెలబ్రేషన్ ఆఫ్ హ్యూమానిటీ’ అనే సినిమాకు ఖవ్వాలి పాటతో సహా 5 పాటలను రాశారట. ముజఫర్ నగర్ లోని 2013లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో జరిగిక ఓ లవ్ స్టోరీ ఈ సినిమా కథ గా తీశారట. ఇటు రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు ఓ మెసేజ్ అందించే సినిమాగా దీన్ని రూపొందించారట. సామాజిక సందేశం ఇచ్చేందుకు సినిమా ప్రధానమైన మాధ్యమమని, ‘మన మనస్తత్వం మారేంత వరకూ ఏ చట్టమూ సమాజంలో మార్పు తీసుకురాలేదన్నారు. ఈ సినిమా గురించి కపిల్ సిబల్. ఈ సినిమాకు ప్రణవ్ సింగ్ దర్శక నిర్మాత . నటీనటులు... అషుతోష్ రానా, జిమ్మీ సేగల్, సంజయ్ సూరీ హిటెన్ తేజ్ వానీ.