హాలీవుడ్ సెక్స్ బాంబ్ పారిస్ హిల్టన్ కి మళ్లీ బాయ్ ఫ్రెండ్ పిచ్చి పట్టుకుంది. గతేడాది మోడల్ రివర్ వీపెరీతో బ్రేకప్ అయ్యాక ఒంటరిగా ఉంటున్న పారిస్ ఇప్పుడు మరో బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకులాట మొదలెట్టిందట. ఇక తన తదుపరి బాయ్ ఫ్రెండ్ సాధారణంగా ఉంటే చాలని అంటోంది. పనిలో పనిగా ఏదో ఒక రోజు తాను కూడా పెళ్లి చేసుకుని పిల్లలతో సెటిల్ కావాల్సిన సమయం తప్పక వస్తుందని తనకు ఏమాత్రం సంబంధం లేని వేదాంత ధోరణిలో మాట్లాడింది. 'ప్రస్తుతం నేను ఒంటరిగా ఉన్నాను. కానీ, ఒంటరితనం అనేది నా జీవితంలో ఎప్పటికీ భాగం కాదు. ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసినా వారిలో ఎవరో ఒకర్ని భాగస్వామిగా ఎంచుకునే పరిస్థితుల్లో లేను' హిల్టన్ తెలిపింది. కాబోయేవాడు ఒక మంచి వ్యక్తి అవడమే కాకుండా నాజూగ్గా ఉండాలని.. సెన్సాఫ్ హ్యూమర్ కలిగి ఉండాలని చెబుతోందీ 34 ఏళ్ల పాప్ సింగర్ కమ్ నటి.