బాహుబలి సందడి బాలీవుడ్ లో అప్పుడే తగ్గుతోందంటే అది బాహుబలిని తక్కువ చేయడానికి లేదు... సల్మాన్ ఖాన్ మీద ఉన్న బాలీవుడ్ క్రేజ్ అలాంటిది. అది కూడా ట్రైలర్ చూసిన జనాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. విచిత్రమేమిటంటే రెండు సినిమాలకూ టాలీవుడ్ కథకుడు, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కావడం. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘బజ్రంగి భాయిజాన్' సినిమా ఈద్ పండగ సందర్భంగా జులై 17న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాను పలువురు బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా చూసిన అనంతరం కరణ్ జోహార్ స్పందిస్తూ...బజ్రంగి భాయిజాన్ సినిమా అయిపోయిన తర్వాత అందరి కళ్లు చెమ్మగిల్లాయన్నారు. ఎమోషన్ జర్నీ, సల్మాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ బావుంది అంటూ ట్వీట్ చేసారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉండబోతోందంటున్నారు. ఇది చిరంజీవి సినిమా పసివాడి ప్రాణంలా ఉందన్న టాక్ కూడా వచ్చేసింది. తీసిన సినిమానే మళ్ళీ తీస్తున్నప్పుడు స్టోరీ కాస్త దగ్గరగా ఉంటేనేం... పిల్లల సెంటిమెంట్ తో తీసే ఏ సినిమా అయినా జనాలకు బాగా నచ్చే అవకాశం ఉంది.