నాగార్జున, కార్తీల కాంబినేషన్ లో పివిపి సంస్థ నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఈ నెల 16 నుండి రెగ్యులర్ చిత్రీకరణని చెన్నైలో ప్రారంభించింది. జయసుధ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తొలి షెడ్యూల్ కార్తీ, జయసుధలపై చిత్రీకరిస్తారట. ఏప్రిల్ ఫస్ట్ నుండి నాగార్జున జాయిన్ అవుతాడట. ఇప్పటి బిజీ లైఫ్ లో పక్కన ఉన్న వారితో మనం మాట్లాడటమే మానేశాం. కానీ ఈ చిత్రంలో మానవ సంబంధాలు ఎంత ముఖ్యమో అని రెండు ప్రధాన పాత్రలు ద్వారా చూపించబోతున్నారని హీరో కార్తీ తెలియజేశాడు.