‘బాయ్స్’ చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ ‘బొమ్మరిల్లు’ సక్సెస్ తో తెలుగు ప్రేక్షకులు ఆయనకు బాగా చేరువయ్యాడు. అయితే ‘జబర్ దస్త్’ చిత్రం తర్వాత తెలుగు సినిమాలకు దూరమయ్యాడు. తమిళంలోనే సినిమాలు చేస్తున్నాడు. తమిళంలో ‘జిగర్ తండా’, ‘ఎనకుల్ ఒరువన్’, ‘కావ్యతలైవన్’సినిమాలతో అక్కడ మంచి సక్సెస్ లు కొట్టినా ఆ సినిమాలను ఇక్కడ విడుదల చేయలేదు. ‘జిగర్ తండా’ చిత్రాన్ని ‘చిక్కడు-దొరకడు’ పేరుతో విడుదల చేయాలనుకున్నా కారణాలు తెలియలేదు కానీ విడుదల చేయలేదు. తాజా సమాచారం ప్రకారం ఆ చిత్రాన్ని తెలుగులో ‘దిల్ రాజు’ అనే పేరు మార్చి విడుదల చేయనున్నారట. తెలుగులో లైఫ్ ఇచ్చిన నిర్మాత దిల్ రాజును సిద్ధార్థ్ ఈ విధంగా స్మరిస్తున్నాడన్నమాట.